బోనులో అమ్మాయిల డ్యాన్స్.. చుట్టూ వందలమంది

బోనులో అమ్మాయిల డ్యాన్స్.. చుట్టూ వందలమంది

పెళ్లంటే బంధువులు, హడావుడి, వచ్చిపోయేవాళ్లతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇదంతా ఒకెత్తయితే.. పెళ్లి తర్వాత తీసే బరాత్ ఒకెత్తు. బరాత్‌లో చిన్నాపెద్దా.. ఆడమగా తేడాలేకుండా తమకు నచ్చిన పాటలకు స్టెప్పులేస్తారు. కొంతమంది అయితే తమ తాహతుకు తగ్గట్లు సింగర్లనో, డ్యాన్సర్లనో రప్పించి.. పాటలు పాడిస్తూ.. డ్యాన్సులు చేయిస్తారు. 

ఈ మాదిరిగానే బీహార్‌లో ఒక పెళ్లి కార్యక్రమంలో డ్యాన్సులు ఏర్పాటు చేశారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అవును ఇటువంటి డ్యాన్స్ ప్రోగ్రాం మీరు ఇదివరకు చూసిండరు. బీహార్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని కోయిల్వార్లో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి డ్యాన్సర్లను తీసుకొచ్చారు. వారిని ముజఫర్‌పూర్ నుంచి ఒక్కొక్కరికి రూ .4,000 చొప్పున చెల్లించి రప్పించారు. అయితే వారితో మామూలుగా బయట ఉంచి కాకుండా.. ఒక బోనులో ఉంచి డ్యాన్స్ చేయించారు. ఆ బోను చుట్టూ అబ్బాయిలంతా చేరి వారితోపాటు డ్యాన్స్ చేశారు. డ్యాన్సర్లను బోనులో పెట్టడానికి కారణం లేకపోలేదు. ఓ పక్క అమ్మాయిలు.. మరో పక్క కరోనా టైం.. అబ్బాయిలు ఆ అమ్మాయిల మీద పడితే ఇంకేమైనా ఉందా? అందుకే అటు అమ్మాయిలకు జాగ్రత్త.. ఇటు కరోనా సోకకుండా ఉంటుందనే భావనతోనే ఇలా చేశారని తెలుస్తోంది.