గోల్డెన్ టెంపుల్‌లో గీతా పారాయణం

గోల్డెన్ టెంపుల్‌లో గీతా పారాయణం

గీతా జయంతి సందర్భంగా బంజారాహిల్స్​ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌‌‌‌ లో సోమవారం ‘బడి పిల్లల గీతా పారాయణం’ నిర్వహించారు. జంట నగరాల్లోని పలు స్కూల్స్​కు చెందిన 1,008 మంది స్టూడెంట్స్​ పాల్గొని 108 శ్లోకాల‌‌‌‌ను పారాయణం చేశారు. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, హరేకృష్ణ మూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ పాల్గొన్నారు. నక్క వెంకటమ్మ, యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషనల్ స్పోర్ట్స్ ఫౌండేషన్, గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో గీతా మహోత్సవ సభ నిర్వహించారు.


హైదరాబాద్​ సిటీ/ముషీరాబాద్, వెలుగు