వీహబ్​తో గీతం యూనివర్సిటీ ఎంవోయూ

వీహబ్​తో గీతం యూనివర్సిటీ ఎంవోయూ

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: తెలంగాణ ప్రభుత్వం మహిళా వ్యవస్థాపకుల కోసం నెలకొల్పిన వీ హబ్​తో పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​యూనివర్సిటీ మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. మహిళల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్​ కంపెనీలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభించిన ఆర్​ఏఎంపీలో భాగంగా గీతం ఈ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం గీతం స్కూల్​ ఆఫ్ బిజినెస్​ ఆవిష్కరణ, వీడీసీ సెంటర్ వీ హబ్​తో కలిసి పని చేస్తాయి. మహిళా ఎంటర్​ప్యూనర్లు వారి వెంచర్లను డెవలప్​ చేసుకునేందుకు అవసరమైన అన్ని రకాల వాతావరణాన్ని ఉమెన్​ ఆక్సిలరేషన్ ప్రోగ్రాం కింద కల్పిస్తారు.

ఎంవోయూపై గీతం స్కూల్​ ఆఫ్ బిజినెస్​ డైరెక్టర్​ దివ్య కృతి గుప్తా, వీ హబ్ డిప్యూటీ డైరెక్టర్​ జాహిద్​అఖ్తర్​షేక్​ సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూ కీలక ముందడుగు అని విద్య, వ్యవస్థాపకత, సహకారం ద్వారా స్థిరమైన వృద్ధిని పెంపొందించగలమని గీతం వీసీ పేర్కొన్నారు. వీ హబ్​ సీఈవో సీత, వీడీసీ కోచ్​లు, ఈ క్లబ్​మెంబర్లు, గీతం హెచ్​వోడీలు, బీబీఏ స్టూడెంట్స్​పాల్గొన్నారు.