అమిత్ షాతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ.. రూ.16 వేల కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్

అమిత్ షాతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ.. రూ.16 వేల కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్

న్యూఢిల్లీ: తెలంగాణకు రూ.16 వేల కోట్ల వరద సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిక్వెస్ట్ చేశారు. గురువారం (సెప్టెంబర్ 4) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు, పంట నష్టం గురించి అమిత్‌ షాకు వివరించారు. 2025, ఆగస్టు 25-28 మంది కురిసిన వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని.. అలాగే గతేడాది సెప్టెంబర్‎లో కురిసిన వర్షాలకు రూ.11 వేల కోట్ల నష్టం వచ్చిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి మొత్తం రూ.16 వేల కోట్ల నష్ట పరిహారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి తక్షణ, అత్యవసర మరమ్మతులకు నిధులు కేటాయించి తెలంగాణను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశారు. కాగా, ఇటీవల కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. వర్షాలు, వరదల ధాటికి భారీగా పంట నష్టం వాటిళ్లడంతో పాటు.. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.