బీజేపీ, కాంగ్రెస్కు ​విద్య, ఉపాధి పేరుతో ఓట్లు అడిగే ధైర్యం ఉందా?

బీజేపీ, కాంగ్రెస్కు ​విద్య, ఉపాధి పేరుతో ఓట్లు అడిగే ధైర్యం ఉందా?

హిమాచల్​ప్రదేశ్ లో  ఎన్నికల హీట్​ స్టార్ట్​ అయ్యింది. ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ముందస్తు  ప్రచారంలో దూసుకుపోతున్నారు. హమీర్​పూర్​ జిల్లాలోని టౌన్ హాల్​లో జరిగిన సభలో కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్​ కు సవాల్​ విసిరారు. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే ఆప్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సానుకూల మార్పులు చేయడం ద్వారా 1,100 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు భద్రత కల్పించిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8.5 లక్షల మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే ఆప్‌కి అవకాశం ఇవ్వాలని కోరారు.దేశ రాజధాని మొత్తం బడ్జెట్‌లో 25 శాతం విద్యకు కేటాయించడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం గత ఏడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలకు రూ.80,000 నుంచి రూ.-85,000 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ధైర్యం ఉంటే విద్య, ఉపాధి పేరుతో ఓట్లు అడగాలని కేజ్రీవాల్‌ అన్నారు.