రాజకీయాలతో సంబంధం లేని డబ్బు ఇచ్చేయండి.. అధికారులకు ఈసీ ఆదేశాలు

రాజకీయాలతో సంబంధం లేని డబ్బు ఇచ్చేయండి.. అధికారులకు ఈసీ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నది. తనిఖీల్లో పట్టుబడిన డబ్బు, ఇతర వస్తువులకు ఎన్నికలు, రాజకీయాలతో సంబంధం లేకపోతే వెంటనే రిలీజ్​ చేయాలని సూచించింది. తెలంగాణలో పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో ఇప్పటి దాకా దాదాపు రూ.380 కోట్ల విలువైన డబ్బుతోపాటు బంగారం, వెండి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఈసీకి వందల సంఖ్యలో కంప్లయింట్స్ వస్తున్నాయి.

ఈ క్రమంలో కేంద్రం ఎన్నికల సంఘం.. కీలక సూచనలు చేసింది. తనిఖీల్లో పట్టుబడిన డబ్బులు, ఇతర ఆభరణాలు రాజకీయాలతో ముఖ్యంగా ఎన్నికలతో సంబంధం లేకపోతే.. అలాంటి వాటిని వెంటనే రిలీజ్ చేయాలని సూచించింది. జిల్లా గ్రీవెన్స్ కమిటీ నుంచి అనుమతి తీసుకుని.. సామాన్యులు, వ్యాపారుల డబ్బును వీలైనంత త్వరగా.. ఆయా వ్యక్తులు, సంస్థలకు ఇచ్చేయాలని సూచించింది.