ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇయ్యాలె: రాజిరెడ్డి

ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇయ్యాలె: రాజిరెడ్డి
  • ఈయూ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రాసెస్ లేట్ అవుతున్న నేపథ్యంలో  కార్మికులకు వెంటనే పీఆర్సీలు ప్రకటించాలని ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. 2 పీఆర్సీల కోసం కార్మికులు 7 ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నారని శనివారం  ప్రకటనలో తెలిపారు.
 రెండు డీఏలు పెండింగ్​లో ఉన్నాయని,  డీఏల బకాయిలు  వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పీఆర్సీలు, డీఏలు ఇవ్వకపోతే ఒక్కో కార్మికుడు కనీసం రూ.4లక్షలు నష్టపోతారని ఆయన గుర్తు చేశారు.  సీసీఎస్ కు ఇవ్వాల్సిన రూ.1,050 కోట్లు, పీఎఫ్ ట్రస్ట్ కు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు.