600 మంది పండిట్, పీఈటీలకూ ప్రమోషన్లు ఇవ్వండి

600 మంది పండిట్, పీఈటీలకూ ప్రమోషన్లు ఇవ్వండి
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వద్ద టీఎస్టీటీఎఫ్ ఆందోళన

హైదరాబాద్, వెలుగు: రోస్టర్ పాయింట్ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 600 మంది పండింట్, పీఈటీలకు ప్రమోషన్లు రాలేదని టీఎస్టీటీఎఫ్ తెలిపింది. వారికి కూడా వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేసింది.  శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వద్ద పండిట్, పీఈటీలతో కలిసి టీఎస్టీటీఎఫ్ నేతలు ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా  టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ..పెండింగ్ లో ఉన్న బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో రోస్టర్ పాయింట్ల కారణంగా సుమారు 600 మంది పండిట్, పీఈటీలకు ప్రమోషన్లు రాలేదన్నారు. వారు కూడా ప్రమోషన్లు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.