
హైదరాబాద్, వెలుగు: లా కోర్సు అడ్మిషన్లలో జాప్యంపై వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలోనే ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ కన్వీనర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులిచ్చామని, ఇప్పుడు ప్రభుత్వం కూడా కౌంటర్ వేయాలంటూ ఉన్నత విద్యా శాఖను ఆదేశించింది. 2024-25లో లా డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల జాప్యంపై అడ్వకేట్ భాస్కర్‌రెడ్డి వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. లా కాలేజీల్లో అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు నష్టపోతున్నారని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కౌంటర్ దాఖలుకు గడువు కావాలని అదనపు ఏజీ కోరడంతో విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది.