పిల్లలకు ఫోన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వొచ్చా?

పిల్లలకు ఫోన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వొచ్చా?

చిన్నారులకు ఫోన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేముందు పేరెంట్స్​ కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌.ఫోన్‌‌‌‌‌‌‌‌లాంటి ఖరీదైన వస్తువులను జాగ్రత్తగా ఉంచగలరా? లేదా? అని ఆలోచించాలి. కొందరికి ఎంత కాస్ట్లీ వస్తువునైనా త్వరగా పాడుచేసే అలవాటు ఉంటుంది. ఇలాంటివాళ్లకు ఫోన్ ఇచ్చేముందు కొంచెం ఆలోచించాలి. టెక్నాలజీకి తగ్గట్లు అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ అవ్వడం తప్పనిసరి. అయినా, కిడ్స్‌‌‌‌‌‌‌‌ ఎంతవరకు టెక్నాలజీని యూజ్‌‌‌‌‌‌‌‌ చేసుకోగలరు? వాళ్ల పరిమితులు, అవసరాలు వంటివి దృష్టిలో పెట్టుకోవాలి. రోజులో ఎక్కువ సమయం గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడుతూ, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో గడుపుతుంటే పిల్లలకు కొంతకాలం ఫోన్ ఇవ్వకపోవడమే మంచిది.