ఆర్టీసీకి బడ్జెట్​లో.. 3%  ఫండ్స్ ఇవ్వండి

ఆర్టీసీకి బడ్జెట్​లో.. 3%  ఫండ్స్ ఇవ్వండి
  •  మంత్రులు భట్టి, పొన్నంను కోరిన ఆర్టీసీ యూనియన్లు

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్​లో ఆర్టీసీకి 3% నిధులు కేటాయించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) నేతలు రాజిరెడ్డి, అబ్రహం మంత్రులు భట్టి, పొన్నం ప్రభాకర్ ను కోరారు. బుధవారం సెక్రటేరియెట్​లో వినతిపత్రం అందజేశారు. కార్మికులకు 2 పీఆర్సీ లు, డీఏ, సీసీఎస్, పీఎఫ్, రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని విన్నవించారు. మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా రన్ అవుతున్నదని, అయితే.. బస్సులు మాత్రం సరిపోవడం లేదన్నారు. కొత్త బస్సులు కొనేందుకు నిధులు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్లను అనుమతించాలన్నారు. అలాగే, ప్రతి నెలా ఆర్టీసీకి మహాలక్ష్మి సబ్సిడీ నిధులు విడుదల చేయాలని ఆర్టీసీ ఎస్​డబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు, కృష్ణ మంత్రి పొన్నంను కోరారు.