50% ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇవ్వాలి

50% ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇవ్వాలి
  • పీఆర్సీ కమిషన్ కు జీజేఎల్​ఏ వినతి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.35వేలు నిర్ణయిస్తూ 50% ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇవ్వాలని గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (జీజేఎల్​ఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్​ను కలిసి ఆయన వినతిపత్రం అందించారు. ఎంప్లాయీస్​కు  గ్రామాల్లో 15%,  మున్సిపాలిటీల్లో 18%, జిల్లా కేంద్రాల్లో 27%, జీహెచ్​ఎంసీ పరిధిలో 27% హెచ్​ఆర్ఏ ఇవ్వాలని కోరారు. రూరల్ ఏరియాల్లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలన్నారు. ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యా వ్యవస్థ డెవలప్ మెంట్ కోసం తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ విద్యలో జూనియర్ లెక్చరర్ పేరును లెక్చరర్​గా మార్చాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవులు ఇవ్వాలని కోరారు.