
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ఫిట్చేసి వారి వారసులకు ఉద్యోగాలివ్వాలని జీఎల్బీకేఎస్ గౌరవ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
కొత్తగూడెంలోని ఇఫ్టూ ఆఫీస్‌లో శనివారం ఆయన మాట్లాడారు. కారుణ్య నియామకాల్లో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. గత ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి లాభాలను ప్రకటించి కార్మికులకు 40 శాతం బోనస్ ఇవ్వాలని కోరారు. జె.సీతారామయ్య, కాపు కృష్ణ, సిద్ధయ్య, రాయమల్లు, అశోక్, వెంకన్న పాల్గొన్నారు.