Glenmark injection: కీమోథెరపీ వాంతులు ఆపేందుకు గ్లెన్‌మార్క్‌ ఇంజెక్షన్

Glenmark injection: కీమోథెరపీ వాంతులు ఆపేందుకు గ్లెన్‌మార్క్‌ ఇంజెక్షన్

కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తో క్యాన్సర్ పేషెంట్లు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. జుట్టు రాలిపోవడం, వికారం, వాంతులు తదితర లక్షణాలతో నరకం అనుభవిస్తారు. అయితే క్యాన్సర్ పేషెంట్లు పడుతున్న ఈ ఇబ్బందులను నివారించేందుకు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ దేశంలో తొలిసారి ఓ ఇంజెక్షన్‌ మార్కెట్లోకి తెచ్చింది. స్విస్ కంపెనీ హెల్సిన్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్న గ్లెన్‌మార్క్ ఫార్మా, ఏకెంజియో ఐవీ పేరుతో ఈ ఇంజెక్షన్స్ ను ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కీమోథెరపీ చేసుకునే అరగంట ముందు ఏకెంజియా ఐవీని పేషెంట్ కు ఇస్తారు. ఈ డ్రగ్ ఇప్పటికే యూఎస్‌లో అందుబాటులో ఉంది.