గ్లెన్​మార్క్​ నుంచి డయాబెటిక్​ డ్రగ్

గ్లెన్​మార్క్​ నుంచి డయాబెటిక్​ డ్రగ్

న్యూఢిల్లీ: గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ భారతదేశంలో మొట్టమొదటిగా యాంటీ- డయాబెటిక్ డ్రగ్ లిరాగ్లుటైడ్  బయోసిమిలర్ వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది.   ఇంజెక్ట్ చేయదగిన యాంటీ- డయాబెటిక్ థెరపీల విభాగంలోకి దీని ద్వారా గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ప్రవేశించింది. దీనిని లిరాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో అమ్ముతారు.  1. 2 మిల్లీటర్ల డెయిలీ డోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ధర దాదాపు రూ. 100గా ఉంది. 

ఫలితంగా థెరపీ ఖర్చు సుమారు 70 శాతం తగ్గుతుందని గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ తెలిపింది. డిస్పోజబుల్ పెన్ లాంటి పరికరం  రిటైల్ ధర  రూ. 1,855 కాగా, ఇందులో 15 డోసులు ఉంటాయి.  అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్,  ఊబకాయంతో పాటు  టైప్–-2 డయాబెటిస్ మెల్లిటస్ రోగులలో గ్లైసెమిక్​ను కంట్రోల్​ చేయడానికి లిరాగ్లుటైడ్ సాయపడుతుంది.