
హైద్రాబాద్: ‘ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలు’ సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ మార్గ్లో నిర్వహించిన డ్రోన్ , క్రాకర్స్ షోలు అబ్బురపరిచాయి.
ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తన పాటలతో ఉర్రూతలూగించాడు. ఫేమస్ సింగర్లతో కలిసి సాగర తీరాన సందడి చేశాడు.
– ఫొటోగ్రాఫర్, వెలుగు