Ram Charan: 'పెద్ది' తర్వాత సినిమా షూటింగ్స్‌కు రామ్ చరణ్ బ్రేక్.. ప్రత్యేక కారణం ఇదే!

Ram Charan: 'పెద్ది' తర్వాత సినిమా షూటింగ్స్‌కు రామ్ చరణ్ బ్రేక్.. ప్రత్యేక కారణం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్.. తన అసాధారణ ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న 'పెద్ది' సినిమాలతో చరణ్ బిజీగా ఉన్నారు.  స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

'పెద్ది' షూటింగ్ పూర్తి కాగానే, చరణ్ తన తదుపరి ప్రాజెక్టు 'RC17' కోసం దర్శకుడు సుకుమార్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ కొత్త సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలాగే, బాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖులతో కూడా చరణ్ సినిమాలు చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

 సినిమా షూటింగ్స్ కు బ్రేక్

అయితే 'పెద్ది' సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే రామ్ చరణ్ కొద్ది నెలల పాటు సినిమాలకు పూర్తిగా విరామం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత జీవితంలోకి రాబోతున్న శుభవార్తే. చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. వీరికి మొదటి సంతానంగా కూతురు క్లీంకార కొణిదెల జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులు కవల పిల్లలను (Twins) స్వాగతించబోతున్నారు. ఈ విషయాన్ని ఉపాసన దీపావళి సందర్భంగా పంచుకున్న సీమంతం వీడియోలో రెండు పాదాల ముద్రలతో పరోక్షంగా తెలియజేయగా, ఉపాసన తల్లి శోభన కామినేని స్వయంగా ధృవీకరించారు. కవలలు పుట్టబోతున్నారనే ఈ 'డబుల్ ధమాకా' వార్త కొణిదెల కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేసింది.

►ALSO READ | Samantha: న్యూ చాప్టర్ బిగిన్స్.. సినిమాలతో పాటు బిజినెస్‌పై దృష్టి పెట్టిన సామ్!

కుటుంబానికి ప్రాధాన్యత.. 

ఈ నేపథ్యంలోనే, భార్య ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉంటూ, పుట్టబోయే కవల పిల్లల కోసం పూర్తి సమయం కేటాయించాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో క్లీంకార పుట్టినప్పుడు కూడా చరణ్ ఇలాగే కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుని, పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించారు. వృత్తి జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, తన కుటుంబానికి, పిల్లలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే చరణ్ నిర్ణయాన్ని అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. త్వరలోనే రాబోయే 'RC17' కోసం మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నప్పటికీ, ఈ విరామం తరువాత రామ్ చరణ్ మరింత ఉల్లాసంగా, కొత్త ఎనర్జీతో తిరిగి వస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.