Samantha: న్యూ చాప్టర్ బిగిన్స్.. సినిమాలతో పాటు బిజినెస్‌పై దృష్టి పెట్టిన సామ్!

Samantha: న్యూ చాప్టర్ బిగిన్స్.. సినిమాలతో పాటు బిజినెస్‌పై దృష్టి పెట్టిన సామ్!

స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో వృత్తి జీవితంలోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇటీవల సామ్ దృష్టి సినిమాల కన్నా వ్యాపారాల వైపే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మొన్నటికి మొన్న సొంతంగా పర్‌ఫ్యూమ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సామ్, తాజాగా మరో నూతన క్లాతింగ్‌ బ్రాండ్‌ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

'ట్రూలీ స్మా' బ్రాండ్‌తో కొత్త అడుగు!

సమంత లేటెస్ట్ గా 'ట్రూలీ స్మా' (Trulee Sma) అనే పేరుతో కొత్త క్లాతింగ్‌ బిజినెస్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్‌కు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'న్యూ చాప్టర్ బిగిన్స్' అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 'సామ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా సక్సెస్ అవ్వాలి', ట్రూలీ స్టైల్ సమంత ఎప్పుడూ యూనిక్‌గానే ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

నిర్మాణంలోనూ సామ్ జోరు

సమంతకు నటనతో పాటు స్టైలిష్ లుక్స్‌కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె ఎప్పుడూ కొత్త డిజైనర్ డ్రెస్సులను ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పటికే సామ్.. 2020లో 'సాకీ' (Saaki) అనే క్లాతింగ్‌ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత 'ట్రూలీ స్మా' బ్రాండ్‌లో భాగమైంది. వ్యాపారాలే కాకుండా, సామ్ 'ట్రలాలా' (Trarala) అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ బ్యానర్‌పై వచ్చిన 'శుభం' అనే సినిమాతో మంచి బోణీ కొట్టింది. ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది.

►ALSO READ | MowgliTeaser: ఎన్టీఆర్ చేతుల మీదుగా 'మోగ్లీ' టీజర్ రిలీజ్.. యంగ్ టైగర్ సపోర్ట్ తో సినిమాకు హైప్!

రాజ్‌ నిడుమోరుతో ప్రేమ వదంతులు..

ఈ ప్రొఫెషనల్ విజయాల పక్కన పెడితే, సామ్ ఈ మధ్యన వ్యక్తిగత విషయాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై ఆమె ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ, ఈ ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. మొత్తానికి, సినిమాలతో పాటు వ్యాపారం, నిర్మాణం రంగాల్లోనూ తనదైన ముద్ర వేయాలని సమంత గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.