MowgliTeaser: ఎన్టీఆర్ చేతుల మీదుగా 'మోగ్లీ' టీజర్ రిలీజ్.. యంగ్ టైగర్ సపోర్ట్ తో సినిమాకు హైప్!

MowgliTeaser: ఎన్టీఆర్ చేతుల మీదుగా 'మోగ్లీ' టీజర్ రిలీజ్.. యంగ్ టైగర్ సపోర్ట్ తో సినిమాకు హైప్!

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ' మోగ్లీ' . ఈ మూవీకి నేషనల్ అవార్డు విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ జోరును పెంచారు. ఇటీవల వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు . ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

ఈ ' మోగ్లీ'  మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.  లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో రోషన్ సరసన సాక్షి సాగర్ మదోల్కర్ నటించింది. వైవా హర్ష ముఖ్య పాత్రలో కనించనున్నారు. ఈ చిత్రానికి కాలా భైరవ సంగీతం అందించారు. ఈ మూవీ టైలర్ ను చూస్తే  ఇది  ఒక యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది.

 

గత నెల ఈ మూవీ గ్లింప్స్ ను హీరో నాని రిలీజ్ చేశారు.  ఓ 25 ఏళ్ల కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడు. వాడు గ్యాంగ్‌స్టర్ కాదు, క్రిమినల్ కాదు... మరి వాడెవరు? వాడి కథ ఏంటి?" - ఈ ప్రశ్నతో 'మోగ్లీ' సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ గ్లింప్స్‌ను హీరో నాని తన వాయిస్ ఓవర్‌తో మరింత ఆకర్షణీయంగా మార్చారు. "ఒక చిన్న ప్రేమ కథ కోసం జరిగిన ఒక పెద్ద యుద్ధం" అని గ్లింప్స్‌ను ముగించి సినిమా కథపై ఉత్సుకతను పెంచారు. ఈ గ్లింప్స్‌లో రోషన్ స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

►ALSO READ | RanaDulquer : 'కాంత'కు ఊహించని షాక్.. లీగల్ చిక్కులతో విడుదలపై సస్పెన్స్!