హైదరాబాద్, వెలుగు : దేశీయ క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రారంభం కానున్న ‘అల్టిమేట్ ఖో ఖో’ లీగ్‌లో జీఎంఆర్, అదానీ గ్రూప్స్ వరుసగా తెలంగాణ, గుజరాత్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి. ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) సహకారంతో ఫ్రాంచైజీ బేస్డ్ ఖో ఖో లీగ్‌ను డాబర్ గ్రూప్ చైర్మన్ అమిత్ బర్మన్ ఏర్పాటు చేశాడు. సౌతిండియాలో ఖో ఖోకు ఉన్న ప్రజాదరణను చూసి లీగ్‌లో పెట్టుబడి పెట్టామని జీఎంఆర్ వెల్లడించింది. మిగతా క్రీడల్లాగే ఖో ఖోను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ టీమ్‌ను తీసుకున్నామని జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి తెలిపారు. ఇక కబడ్డీ, బాక్సింగ్ లీగ్‌లో ఉన్న తమ అనుభవం ఖో ఖో లీగ్‌లోనూ అద్భుతాలు చేస్తుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ పేర్కొన్నారు.

