చనిపోయేందుకు అనుమతించండి

చనిపోయేందుకు అనుమతించండి
  • రాష్ట్రపతికి జ్ఞానవాపి మాజీ పిటిషనర్ లెటర్​

వారణాసి: జ్ఞానవాపి మసీదు కేసు నుంచి వైదొలిగిన తనను తోటి పిటిషనర్లు వేధిస్తున్నారని మాజీ పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో తను చనిపోయేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె లేఖ రాశారు. శుక్రవారం ఉదయం  9గంటల వరకు ఎదురు చూస్తానని, అప్పటికీ స్పందించకుంటే తనే నిర్ణయం తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. కాగా, జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్​లో పూజలు చేసేందుకు అనుమతించాలని కోర్టుకెక్కిన ఐదుగురు పిటిషనర్లలో రాఖీసింగ్​ కూడా ఒకరు. ఇటీవల కేసు నుంచి వైదొలిగిన తర్వాత మిగతా పిటిషనర్లు తనతో పాటు తన కుటుంబాన్ని అవమానిస్తున్నారని, తప్పుడు ప్రచారలతో వేధిస్తున్నారని రాఖీ ఆరోపించారు.

దీంతో  మొత్తం హిందూ సమాజం తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా మారిందని, ఈ ప్రచారంలో ప్రభుత్వం, అధికారులు కూడా ఉన్నారని తెలిపారు.తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, మానసిక వ్యధ నుంచి తప్పించుకునేందుకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని కోర్టుకు ఆమె విన్నవించారు. రాఖీ సింగ్​ మామ జితేందర్​ సింగ్ మాట్లాడుతూ తమ కుటుంబాన్ని వేధిస్తున్న కారణంగా శనివారం కేసు నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. తనతోపాటు తన భార్య, మేనకోడలు రాఖీసింగ్ ​జ్ఞానవాపికి సంబంధించిన అన్ని కేసులు నుంచి వైదొలుగుతామని  చెప్పారు.