జీవో 317 బాధితులు హైకోర్టుకు పోతున్నరు

జీవో 317 బాధితులు హైకోర్టుకు పోతున్నరు
  • న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్లు వేసిన1500 మంది 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 317 సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ బాధిత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్లు వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు1,500 మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ చేపడుతున్న హైకోర్టు బాధితుల అప్పీల్స్‌‌‌‌ను పరిశీలించి న్యాయం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తోంది. 2 నెలల గడువు ఇస్తూ.. వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని ఆర్డర్స్‌‌‌‌ చేస్తోంది. కాగా స్పౌజ్, సీనియారిటీ సమస్యలు, మెడికల్ గ్రౌండ్స్, లొకాలిటీ ఇష్యూస్‌‌‌‌పై టీచర్ల నుంచి అప్పీల్స్‌‌‌‌ తీసుకున్న అధికారులు కొన్ని మాత్రమే పరిష్కరించారు. సీనియార్టీ లిస్టులో ఉన్న తప్పులను కూడా సరిచేయలేదు.