జీవో 46ను వెనక్కి తీసుకోవాలి.. కోర్టు తీర్పు వచ్చేదాకా ఎన్నికలు వాయిదా వేయాలి: ఆర్.కృష్ణయ్య

జీవో 46ను వెనక్కి తీసుకోవాలి.. కోర్టు తీర్పు వచ్చేదాకా ఎన్నికలు వాయిదా వేయాలి: ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: జీవో46ను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50% లోపు రిజర్వేషన్‌‌‌‌లు కొనసాగిస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి మార్గదర్శకాలు విడుదల చేయడం దారుణమన్నారు. ఈ జీవోను రెండ్రోజుల్లో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. శనివారం ఆయన బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌లో మాట్లాడారు. 

బీసీల రిజర్వేషన్‌‌‌‌లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వం జీవో 46ను ఎందుకు విడుదల చేసిందని ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జీవోను విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా  ఉందన్నారు. ఈ జీవోతో  బీసీల హక్కులు దెబ్బతింటాయని, ఇది రాజకీయ మోసమేనని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి, కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగలని ప్రభుత్వానికి కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. లేకుంటే బీసీలల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.