సీపీఐ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం

సీపీఐ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: షాహీన్ బాగ్ కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఢిల్లీ హైకోర్టులోనే  తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. షాహీన్ బాగ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశించాలంటూ సీపీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బాధితులు కాకుండా రాజకీయపార్టీ కోర్టును ఆశ్రయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్ను విత్ డ్రా చేసుకోవాలని సూచించిన కోర్టు.. హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది. హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని స్పష్టం చేసింది.

For more news..

ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారాన్ని ప్రారంభించనున్న మోడీ!

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు