న్యూఢిల్లీ: విజయ్ దళపతి నటించిన జన నాయగన్ మూవీకి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. ఈ సినిమా రిలీజ్ వ్యవహరంలో జోక్యం చేసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా సీబీఎఫ్‌సీకి ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. మద్రాస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని మూవీ యూనిట్‌కు సూచించింది. 2026, జనవరి 20వ తేదీలోగా పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తి అయ్యే వరకు సర్టిఫికెట్‌ను నిలిపివేయాలని సీబీఎఫ్‌సీని ఆదేశించింది.
వివాదం ఏంటంటే..?
దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 2026, జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో జన నాయగన్ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో జన నాయగన్ సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయలేదు.
దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన జన నాయగన్ విడుదల వాయిదా పడింది. సీబీఎఫ్సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ మూవీ నిర్మాత మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని ఆదేశించింది. అయితే.. సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఛాలెంజ్ చేసింది.
Also Read :కొత్త మలుపు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అనంతరం ఈ కేసు విచారణను 2026, జనవరి 21కి వాయిదా వేసింది. ఈ క్రమంలో డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ జన నాయగన్ మూవీ నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గురువారం (జనవరి 15) ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జన నాయగన్ మూవీ విడుదల విషయంలో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని మూవీ యూనిట్‌ను ఆదేశించింది. 2026, జనవరి 20వ తేదీలోగా పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు.
