ప్రముఖ గాయని సునీత కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొత్త మలుపు’. భైరవి అర్థ్యా హీరోయిన్. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ ‘రొమాంటిక్ లవ్‌స్టోరీకి కామెడీ, సస్పెన్స్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
బావ, మరదలుగా ఆకాష్, భైరవి జోడీ చక్కగా కుదిరింది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుంది’ అని చెప్పారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ ‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు. రఘు బాబు, పృథ్వి, ప్రభావతి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యశ్వంత్ సంగీతం అందిస్తున్నాడు.
