
- అబిడ్స్ లో పోటీల పోస్టర్ ఆవిష్కరణ
బషీర్బాగ్, వెలుగు: గోవులతో మానవాళికి కలిగే ఉపయోగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గో విజ్ఞాన పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు గో సేవ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో స్కూల్, కాలేజీ విద్యార్థులు పాల్గొననున్నట్లు లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మాత్ పటేల్ తెలిపారు. శుక్రవారం అబిడ్స్ లో ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.
మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు ఉంటాయని, అక్టోబర్ 26న హైదరాబాద్ లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గోవుల ఆవశ్యకత, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.లక్ష , రెండో, మూడో బహుమతులుగా రూ.50 , రూ. 25 వేలు అందిస్తామని జస్మాత్ పటేల్ తెలిపారు.