
గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఫోన్‌కు బెదిరింపు మెసెజ్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ మెసెజ్‌లో అగంతుకుడు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. తాను అడిగిన డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అగంతుకుడు ఈ మెసెజ్‌ను డైరెక్ట్‌గా సీఎం మొబైల్ ఫోన్‌కే పంపడం గమనార్హం.
‘ఒక గుర్తు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వ్యక్తిగత మొబైల్ ఫోన్ నంబర్‌కు శనివారం ఒక బెదిరింపు మెసెజ్ పంపాడు. తన డిమాండ్ నెరవేర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు’ అని పనాజీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుదేష్ నాయక్ తెలిపారు. నిందితుడి +5732038836 నెంబర్ నుంచి ఈ బెదిరింపు మెసెజ్ పంపాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 504, 506 (ii), 507, మరియు 384ల కింద కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు.
For More News..