ఈ తరం మరీ సున్నితంగా తయారైంది. చిన్న చిన్న విషయాలు.. మార్కులు తక్కువ వచ్చాయని.. పేరెంట్స్ మందలించారని.. అడిగింది కొనివ్వలేదని.. ఎవరో ఏదో అన్నారని.. ఇలా ఇది కూడా కారణమేనా అనే సిల్లీ రీజన్స్ కు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అలాంటి స్టోరీనే ఇది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు ఒక యువకుడు.
గోవా మపుసాకు చెందిన శామ్యుయేల్ దె బ్రగాంక అనే స్టూడెంట్ తన తల్లి, ఇద్దరు అక్కా చెల్లెళ్లతో నివసిస్తున్నాడు. ఇటీవలే డిగ్రీ సెకండ్ ఇయర్ పూర్తయింది. ఇతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. రోడ్డు పక్కన చెత్త వేస్తున్న వీడియోను సోలష్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు.
ఈ వీడియో క్లిప్ చాలా వైరల్ గా మారింది. చాలా మంది రోడ్డుపై చెత్త వేయడాన్ని ఖండిస్తూ కామెంట్స్ చేశారు. చెత్త ఎక్కడ వేయాలో తెలియదా.. బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి బాధ్యత లేని వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
దీనికి తోడు పోలీసుల నుంచి ఆ స్టూడెంట్ కు నోటీసులు వచ్చాయి. పోలీసులు మందు హాజరై.. విచారణకు సహకరించాడు. ఆ తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఫ్యామిలీకి చెందిన లైసెన్స్ తుపాకితో కాల్చుకుని చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సూసైడేనా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యప్తు ప్రారంభించారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో తర్వాత డిప్రెషన్ కు గురయ్యాడని పోలీసులు తెలిపారు. చనిపోయే వరకు ఘోరమైన ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు.
