హరితహారం మొక్కలు మేసిన మేక.. యజమానికి రూ.1500 జరిమానా

హరితహారం మొక్కలు మేసిన మేక.. యజమానికి రూ.1500 జరిమానా

నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం పథకం కింద నాటిన మొక్కలను మేక మేసేసింది. విషయం తెలిసిన వెంనటే గ్రామ పంచాయతీ సిబ్బంది స్పందించి విచారణ చేశారు. మొక్కలు మేసిన మేక యజమానికి రూ.1500 జరిమానా విధించిన ఘటన ముప్కల్ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో హరితహారం కింద గత వర్షాకాలంలో మొక్కలు నాటి ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షిస్తున్నారు. అయితే వీటిని ఒక మేక తినేసింది. దీంతో గ్రామ పంచాయతీ స్పదించి మేక యజమాని బాత్ నతే కిషన్ కు రూ.1500 జరిమానా విధించారు. 
 

ఇవి కూడా చదవండి:

ఎంప్లాయ్‎కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్

పూణెలో బర్డ్‌ఫ్లూ కలకలం