మేక మొక్కలు తిన్నదని.. ఓనర్​కు రూ. 5 వేల ఫైన్​

మేక మొక్కలు తిన్నదని.. ఓనర్​కు రూ. 5 వేల ఫైన్​

నాగర్​కర్నూల్, వెలుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేసిందని మేక ఓనర్​కు రూ. 5 వేల పెనాల్టీ వేశారు. నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో హరితహారంలో భాగంగా 7, 8వ వార్డులలో అధికారులు మొక్కలు నాటారు. టైలర్ రంగస్వామికి చెందిన 4 నెలల మేకపిల్ల 7వ వార్డులో  మొక్కలను మేసిందని మున్సిపాలిటీ అధికారులు తీసుకెళ్లి కొత్త లైబ్రరీ బిల్డింగ్​లో పెట్టి తాళం వేశారు. ఓనర్​కు పెనాల్టీ వేశారు. మేక పిల్ల మేసిందా లేదా అన్నది తనకు తెల్వదని, ఇంకోసారి ఇట్ల జరగకుండా చూసుకుంటానని దాని యజమాని అధికారులను వేడుకున్నా అధికారులు వినిపించుకోలేదు. ఈ విషయమై కమిషనర్ విక్రం సింహారెడ్డి మాట్లాడుతూ హరితహారం మొక్కలు తిన్న మేకను పట్టుకొచ్చాం. యజమానికి రూ.5 వేల జరిమానా విధిస్తామని చెప్పారు.---------