బక్రీద్ సందర్భంగా ఎవరైనా జంతువుల అక్రమవధకు పాల్పడితే కఠిన చర్యలు..

బక్రీద్ సందర్భంగా ఎవరైనా జంతువుల అక్రమవధకు పాల్పడితే కఠిన చర్యలు..

బక్రీద్ సందర్భంగా జంతువధ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. బక్రీద్ సందర్భంగా ఎవరైనా జంతువుల అక్రమవధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలంటూ దాఖలైన పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిబంధనల ప్రకారమే జంతువధ జరగాలని స్పష్టం చేసింది. అంతేకాదు… జంతుమాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, చైనాలో గబ్బిలాలు తినడం కారణంగా కరోనా వచ్చిందన్న ప్రచారం కూడా ఉందని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ కేంద్రాలను తనిఖీ చేశామని చెప్పింది. మాంసం షాపులను తనిఖీ చేస్తున్నారా, లేదా అని హైకోర్టు… జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించింది. ఈ వివరాలన్నింటితో రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు.