వడదెబ్బతో 105 గొర్రెల మృతి

వడదెబ్బతో 105 గొర్రెల మృతి

జోగుళాంబ గద్వాల జిల్లాలో వడదెబ్బ తగిలి 105 గొర్రెలు చనిపోయాయి. గొర్లకాపర్లు లక్షల్లో నష్టపోయారు.ధరూర్ మండలం మార్లబీడులో సోమవారం ఈ ఘటన జరిగింది. కుర్వనర్సిములు, కుర్వ రంగన్న, కుర్వ చిన్న నర్సిములు, పరుశరాముడు, కుర్వ వీరేశ్ లకు చెందిన గొర్లను గ్రామ శివారులోని షెడ్డులో ఉంచారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో వాటికి అక్కడే మేత వేస్తున్నారు. సోమవారం ఎండతీవ్రత ఎక్కువకావడంతో వడదెబ్బ తగిలి చనిపోయాయి. చాలాపేపటివరకు అలికిడి వినిపించకపోవడంతో కాపరులు షెడ్ లో వెళ్లి చూడగా చనిపోయి కనిపించాయి. ఇరవై ఏండ్లుగా తమకు జీవనాధారం గొర్లేనని అంటున్నారు . ఒకేసారి గొర్లన్నీ చనిపోవడంతో దిక్కుతోచడంలేదని వారు ఆందోళన చెందుతున్నారు .

సంఘటన స్థలాన్ని గ్రామ సర్పంచు శ్రీరాములు, గద్వాల జిల్లా పశువైద్యాధికారి ఆదిత్య కేశవ్ సందర్శించారు. షెడ్ ను పరిశీలించి న పశువైద్యాధికారి వడదెబ్బ వల్లనే గొర్లు చనిపోయాయని తేల్చారు . మార్లబీడులో గొర్రెలను కోల్పోయిన కాపర్లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పశువైద్యాధికారితో కూడా మాట్లాడిన ఎమ్మెల్యే నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హమీ ఇచ్చారు.