వెరైటీ బ్రేక్ ఫాస్ట్ : గోబీ పరాటా.. పన్నీర్ పరాటా ఇలా తయారు చేసుకోండి.. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు..!

వెరైటీ బ్రేక్ ఫాస్ట్ : గోబీ పరాటా.. పన్నీర్ పరాటా  ఇలా తయారు చేసుకోండి.. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు..!

పరాటా పేరు వినగానే నోరూరుతుంది కదా..!  ఆ పరాటాలను వేడి వేడిగా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా..!  టేస్ట్​ అదిరిపోయే గోడి పరాటా..పన్నీర్​ పరాటాలను ఎలా తయారు చేయాలో చూద్దాం.. . . !

గోబీ పరాటా తయారీకి కావలసినవి

  • క్యాలీఫ్లవర్ తరుగు: 11/2కప్పు (సన్నగా తరి గినవి) 
  • జీలకర్ర: 1/2 స్పూన్
  • ఉల్లిగడ్డ తరుగు: 1/2కప్పు 
  • పచ్చిమిర్చి తరుగు 2టీస్పూన్లు 
  •  కొత్త మీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు
  •  ఉప్పు: తగినంత
  • అల్లం వెల్లుల్లి: 1టీ స్పూన్
  •  గోధుమ పిండి : 1 కప్పు
  • నూనె లేదా బటర్: 3స్పూన్లు
  • గరం మసాల: 1/2టీస్పూన్
  • కారం: 1/2టీస్పూన్
  • పసుపు: చిటికెడు

తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, 1 స్పూన్ నూనె, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలపాలి. పావుగంట తరువాత కలిపిన చపాతి పిండిని తీసుకొని పెద్ద ముద్దలుగా గుండ్రంగా చేయాలి. పొయ్యి మీద కళాయి పెట్టి అందులో 2 స్పూన్ల నూనె వేసి జీలకర్ర వేయాలి అవి వేగాక ఉల్లిగడ్డ.. పచ్చిమిర్చి తరుగువేసి కొద్ది సేపు వేగించాలి. తరువాత అల్లంవెల్లుల్లి వేసి వేగించాలి. అందులో క్యాబేజి తరుగు వేసి 3 నిమిషాలు వేగించాక... 4 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసి ఉడికించాలి. ఉప్పు, గరంమసాలా, కారం, పసుపు వేసి వేగించాలి. చల్లారాక పిండిముద్దను తీసుకొని మండం చిన్న చపాతిలా చేసుకోవాలి. అందులో ముందుగా తయారు చేసుకున్న క్యాబేజి మిశ్రమాన్ని పెట్టి పిండిని ఉండలు చేయాలి. తరువాత దాన్ని మెల్లగా చపాతిలా వత్తాలి. పెనం వేడిచేసి పరాటాలను బటర్ లేదా.. నూనె వేసి రెండు వైపులా కాల్చాలి..

పనీర్ పరాటా తయారీకి కావలసినవి

  • పనీర్ తురుము: 1 కప్పు
  • క్యాబేజి తురుము: 3/4 కప్పు
  • కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి తరుగు: 2టీస్పూన్లు
  • ఉప్పు: తగినంత
  • గోధుమ పిండి 1కప్పు
  • నూనె లేదా బటర్ 3 స్పూన్లు
  • గరంమసాల: 1/2 టీస్పూన్
  • కారం: 1/2టీస్పూన్
  • పసుపు: చిటికెడు

తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, 1 స్పూన్ నూనె, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలపాలి. పావుగంట నానబెట్టుకోవాలి. తరువాత చపాతి పిండిని పెద్ద ముద్దలుగా గుండ్రంగా చేసుకొని పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో పన్నీర్ తురుము, క్యాబేజీ తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, గరంమసాలా, కారం, పసుపు వేసి కలపాలి. పిండిముద్దను తీసుకొని ముందు మందంగా చిన్న చపాతిలా చేయాలి. అందులో పన్నీర్ మిశ్రమాన్ని పెట్టి పిండిని మళ్లీ ఉండలా చేయాలి. తరువాత దాన్ని మెల్లగా చపాతిలా వత్తాలి. పెనం వేడిచేసి పరాటాలను బటర్ లేదా నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.