పుత్రికోత్సాహంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

పుత్రికోత్సాహంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తండ్రయ్యారు. ఆయనకు కూతురు పుట్టింది. ఈ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ ఫొటోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో తేజస్వీ యాదవ్ తనకు పుట్టిన చిన్నారిని చేతిలో పట్టుకొని, చూస్తూ ఆనందంతో ఉన్నారు. ఇందులో అంతగా ఆకర్షించేందుకు ఏమీ లేకపోయినప్పటికీ.. చూసేందుకు కనువిందుగా ఉంది. ఈ ఫొటోతో పాటు దేవుడు తనకు కూతురు రూపంలో ఓ కానుక పంపించాడని తేజస్వీ యాదవ్ రాసుకొచ్చారు. 

తేజస్వీ యాదవ్ సోదరి రోహిణి ఆచార్య కూడా ట్విట్టర్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఇప్పుడు సంతోషకరమైన అరుపులు ప్రతిధ్వనిస్తాయని, అలాంటి ఆనందాన్ని దేవుడు తమకు బహుమతిగా ఇచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. ఇక తేజస్వి యాదవ్ తొమ్మిది మంది తోబుట్టువులలో చిన్నవాడు. డిసెంబర్ 9, 2021లో ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఉన్న సైనిక్ ఫామ్ హౌస్ లో తేజస్వీ యాదవ్, రాచెల్ గోడిన్హోను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అత్యంత రహస్యంగా జరగడంతో అప్పట్లో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. 

https://twitter.com/yadavtejashwi/status/1640207890396114944