గోదావరికి భారీగా వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక

గోదావరికి భారీగా వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక

భారీ వర్షాలతో పాటు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు గోదావరి నీటిమట్టం 43.50 అడుగుల దగ్గర ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

నీటిమట్టం పెరుగుతుండడంతో స్నాన ఘట్టాలు, కళ్యాణకట్ట వరద నీటిలో మునిగిపోయాయి. చర్ల మండలంలోని తాలి పేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో తాళి పేరు జలాశయం పూర్తిగా నిండింది. వరద కొనసాగుతుండడంతో అధికారులు జలాశయం 10 గేట్లు ఎత్తి వరద నీటిపి దిగువకు విడుదల చేస్తున్నారు.