హమ్మయ్యా.. భద్రచలం వద్ద శాంతించిన గోదావరి

హమ్మయ్యా.. భద్రచలం వద్ద శాంతించిన గోదావరి

భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా మారింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో గోదావరి నది 45.5 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాదహెచ్చరిక కొనసాగిస్తున్నారు. ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్ట్‌‌ 22 గేట్లు ఎత్తి 99,257 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. భారీ వర్షాలు పడుతున్నందున మరో వారం పాటు గోదావరి 40 అడుగుల ఎత్తులోనే ప్రవహించే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ ఆఫీసర్లు చెబుతున్నారు.