ములుగుకు గోదావరి జలాలు తీసుకువస్తామని చెప్పారు మంత్రి సీతక్క. రూ.143 కోట్లతో లిప్ట్ ద్వారా తీసుకురావాలని కేబినెట్ లో నిర్ణయించినట్లు చెప్పారు. ఆదివారం (జనవరి 18) మేడారంలో నిర్వహించిన కేబినెట్ మీటింగ్ అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన సీతక్క.. కేబినెట్ లో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
కేబినెట్ నే మేడారానికి తీసుకొచ్చామని అన్నారు సీతక్క. సీఎంకు ఈ గుడికి కుటుంబ బంధం లేదు, కుల బంధం లేదు.. ఇది భావోద్వేగ బంధం అని.. సీఎం రేవంత్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. మేడారం జాతరపై ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. సమ్మక్క ,- సారలమ్మ ఘనకీర్తి తనకు దక్కడం సంతోషకరం అని ఆనందం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క.
అంతకు ముందు మేడారం జాతార ఏర్పాట్లను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ పరిశీలించారు. మేడారంలో జాతర ఏర్పాట్లకు సంబంధించి దగ్గరుండి వివరాలు తెలుసుకున్నారు సీఎం. పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల పనితీరు పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు, AI టెక్నాలజీ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు పోలీస్ ఉన్నతాధికారులు.
ఆ తర్వాత మంత్రులతో కలిసి బస్సులో జంపన్న వాగు పరిశీలనకు వెళ్లారు సీఎం రేవంత్ . మేడారం జంపన్న వాగు సర్కిల్ వరకు జాతర ఏర్పాట్లను పరిశీలను పరిశీలించారు. మేడారం వై జంక్షన్లో మంత్రులతో కలిసి ఫోటోలు దిగారు. వై జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా ఆదివాసి సంస్కృతి.. పల్లె వాతావరణన్ని ప్రతిబింభించేలా విగ్రహాలు, వాటర్ ఫౌంటెన్ అభివృద్ధి చేసింది ప్రభుత్వం. కొత్తగా అభివృద్ధి చేసిన వై జంక్షన్ ప్రాంత వివరాలు అడిగి తెలుసుకున్నారు.
