గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న 11 మంది ఎంబీబీఎస్ స్టూటెంట్లు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. శుక్రవారం సెమిస్టర్ ఎగ్జామ్స్ ముగియడంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన మెడికోలు స్థానిక పద్మావతి కాలనీ సమీపంలోని ఓ రెస్టారెంట్ నుంచి పార్శిల్ తెప్పించుకొని తిన్నారు.
శనివారం తెల్లవారుజామున వారికి వాంతులు, విరేచనాలు అయి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే మెడికోలను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి కాలేజీ మేనేజ్మెంట్ నిరాకరించింది.
