'గాడ్ ఫాదర్' నుంచి మరో సాంగ్ వచ్చేసింది

'గాడ్ ఫాదర్' నుంచి మరో సాంగ్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలౌతున్నది. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ మూవీ నుండి వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 

'నజ భజ జజర.. నజ భజ జజర.. గజ గజ వణికించే గజరాజాదిగోరా' అంటూ ఈ పాట సాగుతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర ఆలపించారు. 'గాడ్ ఫాదర్' గా హీరో ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని చెబుతూ ఈ పాట సాగుతోంది. 

ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్ బీ చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది.