నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను

నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను

చిరంజీవి నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గాడ్‌‌ ఫాదర్‌‌‌‌’. మోహన్ రాజా దర్శకత్వంలో రామ్ చరణ్‌‌తో కలిసి ఎన్వీ ప్రసాద్‌‌, ఆర్‌‌‌‌.బి.చౌదరి నిర్మిస్తున్నారు. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్‌‌‌‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్‌‌లో వేగం పెంచిన టీమ్.. నిన్న అనంతపూర్‌‌‌‌లో ట్రైలర్‌‌‌‌ను లాంచ్ చేశారు.

‘మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం.. మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక. అన్ని రంగులూ మారతాయి. నెక్స్ట్ సీఎం సీట్లో కూర్చోడానికి ఆల్ పాజిబిలిటీస్ ఉన్న వ్యక్తి’ అంటూ పూరి జగన్నాథ్‌‌ వాయిస్‌‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ‘ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ మేన్ బ్రహ్మ’ అంటూ చిరంజీవి పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాతి సీన్‌‌లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్... ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు.. నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్‌‌‌‌కి హైలైట్‌‌గా నిలిచాయి. ‘మా పార్టీ ఆ బ్రహ్మ వెనుక నిలబడదు’ అంటూ నయనతార, చిరుని అరెస్ట్ చేస్తూ సముద్రఖని, ‘నిన్ను కాపాడటానికి పీకేఆర్ కూడా లేడు’ అంటూ సత్యదేవ్ ఇంటెన్స్‌‌ క్యారెక్టర్స్‌‌లో కనిపిస్తున్నారు. ఆ తర్వాత చిరంజీవి, సల్మాన్‌‌ ఖాన్‌‌ మార్క్‌‌ మాస్ కమర్షియల్ యాక్షన్‌‌ సీన్స్‌‌తో ఆకట్టుకునేలా సాగింది ట్రైలర్.