
హైదరాబాద్, వెలుగు: బజాజ్ ఆటో లిమిటెడ్ ఎలక్ట్రిక్ ఆటో గోగోను తెలంగాణ మార్కెట్లోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. దీనిలో పీ5009, పీ5012, పీ7012 అనే వేరియంట్లు ఉంటాయి. వేరియంట్‌ను బట్టి ఒకసారి చార్జ్ చేస్తే 176 కిమీ నుండి 251 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
వీటిలోని అడ్వాన్స్‌డ్ పీఎమ్ఎస్ మోటార్ వేరియంట్‌ను బట్టి 4.5 కిలోవాట్ల నుంచి 5.5 కిలోవాట్ల వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీపై ఐదేళ్ల వారంటీ ఇస్తారు. భద్రత కోసం ఆటో హజార్డ్, యాంటీ-రోల్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొన్ని మోడళ్లలో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్ వంటి ప్రత్యేకతలూ ఉన్నాయి. ఎక్స్‌షోరూం ధర రూ.3.27 లక్షల నుంచి మొదలవుతంది.