
V6 న్యూస్ ఛానెల్ పేరుతో ఫేక్ వార్తలు ప్రచారం చేయడం సిగ్గు చేటు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: ఆడలేక ఓడినట్టు బీజేపీ పై అసత్య ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమిని ముందే ఒప్పుకుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. V6 న్యూస్ ఛానెల్ బండి సంజయ్ కుమార్ ను గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నుండి తప్పించారని ప్రచారం చేయడం చూస్తుంటే.. ఓటమి తప్పదు అని టీఆర్ఎస్ కు బాగా అర్థం అయినట్టుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు బండి సంజయ్ అంటే భయం పట్టుకున్నట్లుందని.. అందు వల్లే ఫేక్ న్యూస్ లు ప్రచారం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో ఫేక్ న్యూస్ ప్రచారం చేసి రెండో స్థానానికి పరిమితం అయిన TRS ఇప్పుడు మూడో స్థానానికి పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
బండి సంజయ్ ని అరెస్టు చెయ్యాలి… ఆయన ప్రచారాన్ని రద్దు చేయాలి.. అని నిద్రలో కూడా బండి భజన చేస్తున్న కేటీఆర్ కు బండి అంటే బాగా భయం పట్టుకున్నట్లుందన్నారు. బండి భాష పై నిషేధం విధించాలంటున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ నోరు తెరిస్తే లాగులు తడుస్తున్నాయ్… అన్నారు. అయ్యా కొడుకులు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా తయారయ్యారు .. KTR ఇన్నిరోజులు ట్విట్టర్ పిట్ట.. ఇవ్వాళ అబద్దాల పుట్ట.. సోషల్ మీడియా ను పౌరులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుపడానికి ఒక ఫ్లాట్ ఫాం… కానీ కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేయడానికి వాడుకోవడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు.
for MORE NEWS..
V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు
జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?
వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..