బీసీ బిల్లు ఆమోదానికి ప్రత్యేక రైలులో ఢిల్లీకి..

బీసీ బిల్లు ఆమోదానికి ప్రత్యేక రైలులో ఢిల్లీకి..
  • కులవృత్తుల పనిముట్లతో బయలుదేరుతామన్న జాజుల 

ఖైరతాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం చట్టం చేసేలా కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్ కోరారు. కుందారం గణేశ్​చారి అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు. 

శ్రీనివాస్​ గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ ఇప్పుడు మాట మార్చుతోందని, మైనారిటీ రిజర్వేషన్ల సాకుతో అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. ఏప్రిల్​ 2న ఢిల్లీలోని జంతర్​ మంతర్​వద్ద జరిగే ‘బీసీ పోరు గర్జన’కు భారీగా తరలిరావాలని, 31న ఉదయం సికింద్రాబాద్​స్టేషన్​నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందన్నారు. అన్ని కుల వృత్తుల పనిముట్లను ఢిల్లీలో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వి.హెచ్, బాలరాజు గౌడ్​, కుల్కచర్ల శ్రీనివాస్​ముదిరాజ్, ప్రొఫెసర్​భాగయ్య,  వేముల వెంకటేశం, దుర్గయ్య గౌడ్, లక్ష్మణ్​యాదవ్ పాల్గొన్నారు.