వరంగల్ పోతున్న... రాకేష్ కుటుంబాన్ని పరమర్శిస్తా

వరంగల్ పోతున్న... రాకేష్ కుటుంబాన్ని పరమర్శిస్తా

సైన్యంలో చేరికలను ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టడాన్ని దేశంలో యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమన్నారు. ఈ క్రమంలోనే  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో  ఘటన జరిగిందని చెప్పారు. దేశ బలం జవాన్, కిసాన్ అని ..రైతులు దేశానికి వెన్నముఖ, సైనికులు దేశ రక్షణ...అని గొప్ప సందేశాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటుందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీపైనే కాదు... ఇచ్చిన నినాదం పైనా కక్ష కట్టిందని తెలిపారు. పార్లమెంట్ లో చర్చించిన తర్వాత  చేయాల్సిన చట్టాలను.. చట్టాలు చేసిన తర్వాత పార్లమెంట్ కి తీసుకువస్తున్నారని తెలిపారు. సైనికులను అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం నియమాలపై దుందుడుకుగా వ్యవహరిస్తోందన్నారు. అగ్నిపథ్ పథకం వల్ల సైన్యంలో చేరిన యువకులకు 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా బయటకు పంపించే పథకం అన్నారు. ఇప్పటికే దేహదారుడ్య పరీక్షలు పూర్తి చేసుకొని..పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకులపై మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన చర్యలే సికింద్రాబాద్ లో జరిగిందన్నారు. కాంగ్రెస్ హింసకు వ్యతిరేకం అన్నారు. పోలీస్ కాల్పుల్లో వరంగల్ కు చెందిన యువకుడు చనిపోయాడని.. ప్రభుత్వ విధానాల వల్ల వేలాది మంది యువకులు నిరసన తెలిపారన్నారు.

ముందుగా లాఠీచార్జి చేయడం వల్ల అక్కడ హింస జరిగిందని.. సంయమనం కోల్పోయి రైల్వే ఫోర్స్ కాల్పులు జరిపిందని చెప్పారు. యువకుడు మరణించడంతో పాటు ఐదు గురికి గాయాలయ్యాయని తెలిపారు. కోటి రూపాయలు ఇచ్చి పరమర్శించాల్సిన కిషన్ రెడ్డి, అమిత్ షా దగ్గరికి వెళ్లరని చెప్పారు. ట్విట్టర్ పిట్ట ట్విట్టర్ లో ఏదో వాగితే దానికి మాట్లాడుతుండని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు..ఇద్దరు దోషులే అన్నారు. పార్లమెంట్ వేదికగా ఎందుకు నిలదీయలేదన్న రేవంత్ రెడ్డి.. తక్షణమే అగ్నిపథ్ విధానం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రధాని పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలోనూ బస్సుల అద్దాలు పగిలయి, రైళ్లు తగులబెట్టారని.. వేలాదిమంది యువకులు నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. బాధ్యత కలిగిన కిషన్ రెడ్డి ఎం మట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి.. వాళ్ళ అధ్యక్షుడి నాలెడ్జ్ అంతే అన్నారు. కాంగ్రెసు పిలుపునిస్తే టీఆరెస్,ఎంఐఎం దాడి చేశారా..? ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా.. రాష్ట్రంలో తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం..నేను వరంగల్ పోతున్న... రాకేష్ కుటుంబాన్ని పరమర్శిస్తా  అన్నారు రేవంత్ రెడ్డి.