ఈ పండుకి రెండువేల ఏళ్లనాటి చరిత్ర ఉందట

ఈ పండుకి రెండువేల ఏళ్లనాటి చరిత్ర ఉందట

గోజి బెర్రీ...  చూడ్డానికి ఎర్రగా.. ద్రాక్ష సైజులో ఉంటుంది. టిబెట్, నేపాల్, వెస్ట్ చైనాలలో ఎక్కువగా దొరికే ఈ  ఫ్రూట్ ఇప్పుడు మన దగ్గరా కనిపిస్తోంది. దీనివల్ల లాభాలేంటి?  అంటారా. ఈ పండులో ఇమ్యూనిటీని  పెంచే యాంటీ ఆక్సిడెంట్స్​తో పాటు అమైనో యాసిడ్స్​ , మినరల్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాయి స్టడీలు. ఈ పండుకి రెండువేల ఏళ్లనాటి చరిత్ర ఉందనేది కొన్ని రీసెర్చర్ల ​ మాట. అసలు ఈ పండు కథేంటంటే.

వోల్ఫ్​ బెర్రీగానూ పేరున్న ఈ ఫ్రూట్​ని  రెండువేల సంవత్సరాల కిందట చైనాలో గుర్తించారట. అప్పట్లో చైనాలోని ఒక ఊరికెళ్లిన డాక్టర్​ అక్కడి జనాలంతా వందేళ్ల పైన బతకడం చూసి ఆశ్చర్యపోయాడట. దానిపైన రీసెర్చ్​ చేస్తుంటే  ఆ ఊరి బావి చుట్టూ  గోజి బెర్రీ మొక్కలు కనిపించాయట. ఆ చెట్టు పండ్లు బావిలో పడి, వాటిలో ఉండే పోషకాలన్నీ నీళ్లలోకి చేరాయట. అవి తాగడం వల్ల వాళ్లు వందేండ్లు దాటినా ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. దాంతో అప్పట్నించీ చైనా వాళ్లు ఈ చెట్టు ఆకులు, కొమ్మల్ని కూడా వంటల్లో కలిపేశారు. ఆ తరువాత గోజి బెర్రీ సూపర్​ ఫ్రూట్​గా అన్ని దేశాలకి పరిచయం అయింది. మన దగ్గరా ఇవి బాగానే దొరుకుతున్నాయి. ఇవి తినడం వల్ల లాభాలేంటంటే..  

  • గోజి బెర్రీలో  వయసు ఛాయలు కనిపించకుండా చేసే న్యూట్రియెంట్స్​, విటమిన్స్​ ఎక్కువ. ఈ పండు ఇమ్యూనిటీ బూస్టర్​ కూడా.  అలాగే స్కిన్​, బ్రెస్ట్​ క్యాన్సర్స్​​తో పాటు  గుండె సంబంధిత సమస్యల్ని దరిచేరనివ్వదు. 
  • ఈ పండులోని విటమిన్​– ఎ, సి,  జియాగ్జాంతిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటిచూపుని మెరుగుపరుస్తాయి. వీటిల్లోని కెరటిన్​ పొడిబారిన చర్మాన్ని రీఫ్రెష్​ చేస్తుంది. అందుకే మాయిశ్చరైజర్లు, క్రీములు, సబ్బుల తయారీలోనూ  ఈ పండునే వాడతారు.
  • గోజి బెర్రీ  కొలెస్ట్రాల్​ని కంట్రోల్​ చేస్తుంది. కార్డియోవాస్క్యులర్ డిసీజ్‌ల నుంచి కాపాడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ న్యూట్రియెంట్స్​ ఉన్న ఈ ఫ్రూట్​ తింటే బరువు తగ్గొచ్చు అంటున్నారు కూడా. 
  • వంద గ్రాముల గోజి బెర్రీల్లో ఐరన్ – 9 మి.గ్రా, రిబోఫ్లేవిన్– 1.3 మి.గ్రా , క్యాల్షియం– 150  మి.గ్రా , సెలీనియం– 50 మి.గ్రా , పొటాషియం, 1,132 మి.గ్రా , జింక్– 2 మి.గ్రా  ఉంటాయి. ఈ పండు తినడం వల్ల  వీటితో పాటు పదకొండు రకాల మినరల్స్, 18 రకాల అమైనో యాసిడ్స్ శరీరానికి అందుతాయి. 
  • వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్​ ట్యూమర్స్​ని దరిచేరనివ్వవు. ఈ పండు తింటే  పాలిసాకరైడ్స్  సరిపడా అంది గ్లూకోజ్​ లెవల్స్​ అదుపులో ఉంటాయి. దానివల్ల డయాబెటిస్​ రాదు. పాలిసాకరైడ్స్ ఇమ్యూనిటీ బూస్టర్‌‌లా కూడా పనిచేసి జలుబు,  ఫ్లూల నుంచి కాపాడతాయి.