గోల్కొండ గ్రామంలో సర్పంచ్‌ సొంత నిధులతో నీటి వసతి

గోల్కొండ గ్రామంలో సర్పంచ్‌ సొంత నిధులతో నీటి వసతి

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ గ్రామంలో గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య సొంత నిధులతో బోర్ వేయించి నీటి కొరత తీర్చారు.  నీటి సమస్యలు గుర్తించిన సర్పంచ్ గ్రామ పంచాయతీ సమీపంలోని స్కూల్ వెనకాల  సొంత నిధులతో బోరు వేయించారు.  

దీంతో గ్రామస్థులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.