బంగారం ధర రూ.2 వేలు జంప్ .. రూ. 5,540 పెరిగిన వెండి ధర

బంగారం ధర రూ.2 వేలు జంప్ .. రూ. 5,540 పెరిగిన వెండి ధర

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం ధర బుధవారం రూ. 2,000 పెరిగి రూ. 1,27,900  గ్రాములకు చేరింది. అంతర్జాతీయ ట్రెండ్‌‌లు బలంగా ఉండటం దీనికి కారణం. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా  రూ. 2,000 పెరిగి రూ. 1,27,300 చేరుకుంది. 

గత రెండు సెషన్లలో బంగారం ధర రూ. 3,300 పెరిగింది. రెడ్​ ఫోర్ట్​ సమీపంలో నవంబర్​ 10న జరిగిన పేలుడు కారణంగా మంగళవారం బులియన్​ మార్కెట్లను మూసివేశారు. అంతర్జాతీయ మార్కెట్‌‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌‌ ధర 4,100 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ. 5,540 పెరిగి రూ. 1,61,300 (అన్ని పన్నులతో సహా)కి చేరింది. సోమవారం దీని కిలో ధర రూ. 1,55,760 పలికిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్​తెలిపింది.