Gold Rate: షాక్ ఇచ్చిన గోల్డ్ రేటు.. తులం రూ.2వేల 400 అప్.. అయోమయంలో హైదరాబాదీలు..

Gold Rate: షాక్ ఇచ్చిన గోల్డ్ రేటు.. తులం రూ.2వేల 400 అప్.. అయోమయంలో హైదరాబాదీలు..

Gold Price Today: అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలు కొనసాగటంతో పాటు మళ్లీ కరోనా మరణాల ప్రారంభంతో అస్థిరతలు అలుముకున్నాయి. దీంతో నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన సేఫ్ హెవెన్ బంగారం ప్రస్తుతం ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరగటంతో మళ్లీ ధరలు సామాన్యులకు దూరంగా జరుగుతున్నాయి. అసలే శుభకార్యాల కోసం షాపింగ్ చేద్దామనుకుంటున్న వారు ముందుగా నేటి తాజా ధరలను తెలుసుకుని ప్లాన్ చేసుకోవటం మంచిది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.2వేల 200 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 930, ముంబైలో రూ.8వేల 930, దిల్లీలో రూ.8వేల 945, కలకత్తాలో రూ.8వేల 930, బెంగళూరులో  రూ.8వేల 930, కేరళలో రూ.8వేల 930, వడోదరలో రూ.8వేల 935, జైపూరులో రూ.8వేల 945, లక్నోలో రూ.8వేల 945, మంగళూరులో రూ.8వేల 930, నాశిక్ లో రూ.8వేల 933, అయోధ్యలో రూ.8వేల 945, బళ్లారిలో రూ.8వేల 930, గురుగ్రాములో రూ.8వేల 945, నోయిడాలో రూ.8వేల 945 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితో 100 గ్రాములకు రూ.2వేల 400 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే..  గ్రాముకు చెన్నైలో రూ.9వేల 742, ముంబైలో రూ.9వేల 742, దిల్లీలో రూ.9వేల 757, కలకత్తాలో రూ.9వేల 742, బెంగళూరులో రూ.9వేల 742, కేరళలో రూ.9వేల 742, వడోదరలో రూ.9వేల 747, జైపూరులో రూ.9వేల 757, లక్నోలో రూ.9వేల 757, మంగళూరులో రూ.9వేల 742, నాశిక్ లో రూ.9వేల 745, అయోధ్యలో రూ.9వేల 757, బళ్లారిలో రూ.9వేల 742, గురుగ్రాములో రూ.9వేల 757, నోయిడాలో రూ.9వేల 757గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 930 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు రూ.9వేల 742గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.3వేలు పెరిగి రూ.లక్ష 11వేల వద్ద ఉంది.