గోల్డ్- సిల్వర్ రేట్లు పెరుగుతున్నా తగ్గేదే లే అంటున్న షాపర్స్.. హైదరాబాదులో రేట్లు ఇలా..

గోల్డ్- సిల్వర్ రేట్లు పెరుగుతున్నా తగ్గేదే లే అంటున్న షాపర్స్.. హైదరాబాదులో రేట్లు ఇలా..

ఎవరు ఎన్ని చెప్పినా బంగారం, వెండి రేట్లు మాత్రం తమ రికార్డులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు గోల్డ్ రేట్ల పెరుగుదలకు ఒక కారణంగా ఉండగా.. రోజురోజుకూ పడిపోతున్న రూపాయి మారకపు విలువ కూడా దిగుమతుల భారాన్ని పెంచేస్తూ ధర పెరుగుతోంది. మరోపక్క రిటైల్ మార్కెట్లో షాపర్లు మాత్రం రేట్లు ఎంత పెరిగినా మేం కొనటంలో తగ్గేదేలే అన్నట్లుగా దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు కొనలేకపోతే భవిష్యత్తులో బంగారం, వెండిని టచ్ కూడా చేయటం కష్టమే అనే భావనతో అప్పు చేసైనా పిసరంత బంగారం వెనకేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం రోజున మారిన రేట్లను గమనించి షాపింగ్ నిర్ణయం తీసుకోవటం మంచిది. 

జనవరి 24న బంగారం రేట్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.147 పెరిగింది దేశంలో. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.15వేల 862గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 540గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : జనవరి 27న బ్యాంకుల సమ్మె..

ఇక వెండి భారీగా పెరుగుతూ అప్పుడప్పుడూ కొద్దిగా తగ్గుతోంది. సామాన్యుల బంగారంగా ఉన్న వెండి రోజురోజుకూ వారికి దూరమౌతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే శుక్రవారం జనవరి 24, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గింది దేశీయంగా. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 60వేల 100గా ఉంది. అంటే గ్రాము ధర రూ.361 వద్ద ఉంది.